Monday, April 29, 2024

మట్టిలో కప్పి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. భారత్‌బంగ్లాదేశ్ సరిహద్దు లోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్ నాడియా జిల్లా విజయపూర్ గ్రామంలో ఓ ఇంటిలో ఈ బంగారం గుంతలో దాచి ఉంది. బీఎస్‌ఎఫ్, డిఆర్‌ఐ బృందాలు సంయుక్తంగా సెప్టెంబర్ 2న సోదాలు చేయగా, ఓ గుంత తవ్వి మట్టికింద అక్రమంగా దాచి ఉంచిన రెండు బ్యాగుల్లో 106 బంగారం బిస్కెట్లు, ముక్కలను సీజ్ చేశారు. బంగారం బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కిలోలు ఉండగా, దీని ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా.

బంగారం అక్రమ తరలింపులో వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితోపాటు అతడికి సహాయకుడిగా ఉన్న మరొకరిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరు స్మగ్లర్లు రవీంద్రనాథ్ బిస్వాస్, విధాన్ ఘోష్‌గా గుర్తించారు. మసూద్, నసీఫ్ అనే ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయుల నుంచి తామీ బంగారం సంపాదించామని విచారణలో వారు వెల్లడించారు. ఈ బంగారాన్ని తాము నాడియా కు చెందిన సంతోష్ హల్దార్‌కు అప్పగించాలనుకున్నామని, కానీ బిఎస్‌ఎఫ్ అధికారుల నిఘాకు భయపడి ఇంటిలో దాచిపెట్టామని నిందితులు వెల్లడించారు. దర్యాప్తు పూర్తయిన తరువాత నిందితులను, బంగారం బిస్కట్లను డిఆర్‌ఐ బృందానికి అప్పగించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News