Thursday, May 2, 2024

నేడు జ్వాలావలయ సూర్యగ్రహణం

- Advertisement -
- Advertisement -

Solar Eclipse or Surya Grahan 2020

 తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 వరకు జ్వాలావలయ సూర్యగ్రహణం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్

హైదరాబాద్ : నేడు ఖగోళంలో అద్భుత సంఘటన చోటుచేసుకోబోతుందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ దశాబ్ధంలో మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ సూర్యగ్రహణం ఆదివారం ఏర్పడనుందన్నారు. ప్రపంచ వ్యాప్తం గా ఆదివారం ఉదయం 9.11 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు సూర్య గ్రహణం ఉంటుందన్నారు. కాగా మన దేశంలో ఈ సూ ర్య గ్రహణాన్ని మొదటీగా గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో చూడవచ్చన్నారు. ఇది కొన్ని ప్రాం తాల్లో పాక్షికంగా కనబడదన్నారు.

సూర్యగ్రహణం కారణంగా నేడు అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ గ్రహణం ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం ఉంటుందని, తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 వరకు 51 శాతం గ్రహణం ఉంటుందన్నారు. మరోవైపు గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని, గర్భిణులు బయటకు రాకూడదన్న మూఢనమ్మకాలు ప్రచా రం చేస్తున్నారని, ఇవన్నీ అవాస్తవాలని, ఇలాంటివి నమ్మకూడదని సైంటిస్ట్ రఘునందన్ స్ప ష్టం చేశారు. మరోవైపు గ్రహణం నేపథ్యంలో ఆలయాలను మూసివేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News