Monday, April 29, 2024

20 రోజులు.. 2 లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

Within 20 days 2 lakh corona positive cases

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో కొత్తగా 14,516 కేసులు నమోదు కాగా,375మంది మృతి చెందారు. శనివారం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,95,048 కి చేరుకోగా, మరణాలు 12,948కి చేరాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,68,269 కాగా, డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లినవారు 2,13,830 మంది. రికవరీ రేట్ 54.12 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం కేసుల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉన్నది. మరణాల సంఖ్యలో ఎనిమిదో స్థానంలో ఉన్నది.

జూన్ 1నుంచి 20 వరకు దేశంలో రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనే అన్నది గమనార్హం. దేశంలో 24 గంటల్లో 375 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 142, ఢిల్లీలో 66, తమిళనాడులో 41, గుజరాత్‌లో 27, ఉత్తర్‌ప్రదేశ్‌లో 23, బెంగాల్‌లో 11, రాజస్థాన్‌లో 10, కర్నాటకలో 10, హర్యానాలో 10, మధ్యప్రదేశ్‌లో 9, పంజాబ్‌లో 9, బీహార్‌లో 6, జమ్మూకాశ్మీర్‌లో 4, ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 3 మరణాలు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 12,948 కాగా, మహారాష్ట్రలో 5893, ఢిల్లీలో 2035, గుజరాత్‌లో 1618, తమిళనాడులో 666, బెంగాల్‌లో 529, మధ్యప్రదేశ్‌లో 495, ఉత్తర్‌ప్రదేశ్‌లో 488, రాజస్థాన్‌లో 333, తెలంగాణలో 198, హర్యానాలో 144, కర్నాటకలో 124,ఆంధ్రప్రదేశ్‌లో 96, పంజాబ్‌లో 92, జమ్మూకాశ్మీర్‌లో 75, బీహార్‌లో 50, ఉత్తరాఖండ్‌లో 26, కేరళలో 21, ఒడిషాలో 11, జార్ఖండ్‌లో 11, ఛత్తీస్‌గఢ్‌లో 10, అస్సాంలో 9, హిమాచల్‌ప్రదేశ్‌లో 8, పుదుచ్చేరిలో 7, చండీగఢ్‌లో 6, మేఘాలయ, త్రిపుర, లడఖ్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

మొత్తం కేసులు మహారాష్ట్రలో 1,24,331, తమిళనాడులో 54,449, ఢిల్లీలో 53,116, గుజరాత్‌లో 26,141, ఉత్తర్‌ప్రదేశ్‌లో 15,785, రాజస్థాన్‌లో 14,156, బెంగాల్‌లో 13,090, మధ్యప్రదేశ్‌లో 11,582, హర్యానాలో 8281, కర్నాటకలో 7961, ఆంధ్రప్రదేశ్‌లో 7961, బీహార్‌లో 7181, తెలంగాణలో 6526, జమ్మూకాశ్మీర్‌లో 5680, అస్సాంలో 4904, ఒడిషాలో 4677, పంజాబ్‌లో 3832, కేరళలో 2912, ఉత్తరాఖండ్‌లో 2177, ఛత్తీస్‌గఢ్‌లో 2028, జార్ఖండ్‌లో 1965, త్రిపురలో 1178, గోవాలో 725, లడఖ్‌లో 744, మణిపూర్‌లో 681, హిమాచల్‌ప్రదేశ్‌లో 619, చండీగఢ్‌లో 381, పుదుచ్చేరిలో 286, నాగాల్యాండ్‌లో 198, మిజోరంలో130, అరుణాచల్‌ప్రదేశ్‌లో 103, సిక్కింలో 70, దాద్రానగర్ హవేలీ, దమన్‌దీవుల్లో 62, అండమాన్ నికోబార్ దీవుల్లో 45, మేఘాలయలో 44 నమోదయ్యాయి. మరో 9265 కేసుల్ని ఏ రాష్ట్రానివన్నది ఐసిఎంఆర్ నిర్ధారిస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News