Sunday, May 5, 2024

భారత్‌లో 4లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

15413 new Covid 19 cases and 306 deaths in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 306 మరణాలు, అత్యధికంగా  15,413 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4లక్షల 10,461కి చేరుకున్నాయి. ఇప్పటివరకు ఇండియాలో 13,254 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. భారత్ లో ప్రస్తుతం లక్షా 69 వేల 451 యాక్టివ్ కేసులుండగా… 2లక్షల 27,755 మంది కోవిడ్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఒక్కరోజులోనే భారత్ లో రికార్డు స్థాయిలో 15వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అటు తెలుగురాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎపిలో ఇప్పటివరకు 8,452 కరోనా కేసులు.. 101 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో 7,072 మందికి కరోనా సోకగా… 203మందిని కరోనా కబలించింది. మహారాష్ట్రాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,28,205మందికి కరోనా సోకింది. 64,153 మంది కరోనాతో కోలుకున్నారు. 5,984 మంది కోవిడ్-19 తో చనిపోగా… ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 58,068 యాక్టివ్ కేసులున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ లలో కరోనా మహమ్మరి కేసులు భారీగా పెరుగుతున్నాయి.

15413 new Covid 19 cases and 306 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News