Sunday, April 28, 2024

మహిళా జర్నలిస్టు హత్య కేసులో 15ఏళ్ల తర్వాత తీర్పు..

- Advertisement -
- Advertisement -

ఓ జర్నలిస్టు హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. మరొక దోషికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ 2008 సెప్టెంబర్ 30న దారుణ హత్యకు గురయ్యారు. డ్యూటీ ముగించుకుని రాత్రివేళ ఇంటికి కారులో బయల్దేరిన సౌమ్యను కొందరు దుండగులు మరో కారులో వెంటాడి, మార్గమధ్యంలో ఆమెను కాల్చి చంపారు.

ఈ కేసులో పోలీసులు రవికపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్ కుమార్, అజయ్ సేథీలను అరెస్టు చేశారు. కేసును విచారించిన న్యూ ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు జడ్జ్ రవీంద్ర కుమార్.. అజయ్ సేథీ మినహా మిగిలినవారికి యావజ్జీవ ఖైదుతోపాటు తలా 1.25 లక్షల రూపాయల జరిమానా విధించారు. అజయ్ సేథీకి మూడేళ్ల సాధారణ కారాగార శిక్షతోపాటు 7.25 లక్షల జరిమానా విధించారు.

ఈ మొత్తం జరిమానాల నుంచి 12 లక్షల రూపాయలను బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. దుండగులలో రవి కపూర్.. సౌమ్యను దేశవాళీ పిస్టల్ తో కాల్చి చంపాడని, మిగిలినవారు అతనికి సహకరించారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. దుండగులు దోపీడీ జరిపేందుకే హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తీర్పు కోసం పదిహేనేళ్లుగా నిరీక్షిస్తున్నానని హతురాలి తల్లి మాధవి విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News