Friday, April 26, 2024

గెలిచినా సౌతాఫ్రికా ఇంటికే

- Advertisement -
- Advertisement -

South Africa beat England by 10 runs

ఇంగ్లండ్‌కు తొలి ఓటమి
సెమీస్‌లో ఆస్ట్రేలియా

షార్జా: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వరుస విజయాలకు సౌతాఫ్రికా బ్రేక్ వేసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచినా సౌతాఫ్రికాకు సెమీఫైనల్ బెర్త్ దక్కలేదు. మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వండర్ డుసెన్ ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు మార్‌క్రమ్ 4 సిక్స్‌లు, రెండు బౌండరీలతో 25 బంతుల్లోనే 52 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్ రబడా హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News