Saturday, April 27, 2024

కాచిగూడ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన దక్షిణమధ్య రైల్వే జిఎం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  కాచిగూడ రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శనివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ ఇతర ఉన్నతాధికారులు జిఎం వెంట ఉన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ (అర్‌ఆర్‌ఐ) వ్యవస్థను తనిఖీ చేశారు. రిలే గదిలో అనుసరించే అన్ని భద్రత, సాంకేతిక అంశాలతో పాటు విధానాల గురించి ఆయన అధికారులతో సమీక్షించారు. సిగ్నలింగ్ పరికరాలు, బాక్సులు, పాయింట్లను జిఎం పరిశీలించారు.

డివిజనల్ అధికారులు జనరల్ మేనేజర్‌కు భద్రతాపరమైన పని విధానం గురించి వివరించారు. అక్కడ ప్రయాణికుల సౌకర్యాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అధికా రులను ఆయన అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై, అదనపు సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై అధికారులతో జిఎం చర్చించారు. బుకింగ్ కార్యాలయంతో పాటు పార్శిల్ బుకింగ్ కార్యాలయ ఆవరణలో లోడింగ్ కోసం నిలువ ఉంచిన సరుకులను ఆయన పరిశీ లించారు. అనంతరం సర్క్యులేటింగ్ ఏరియా, రైల్వే కాలనీ ఆవరణలను జనరల్ మేనేజర్ పరిశీలించి తదుపరి అభివృద్ధిపై అధికారులతో సమీక్షిం చారు. కాచిగూడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో ఒకటి. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 105 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్ ఎన్‌ఎస్‌జి 2 కేటగిరీ కిందకు వస్తుంది. రోజుకు సగటున 50,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తుండగా సుమారు రూ.70 లక్షల ఆదాయం వస్తుంది. ఈ స్టేషన్ 100 శాతం ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్‌గా గుర్తింపు పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News