Saturday, May 4, 2024

ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలి : దమ రైల్వే జిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : నిర్వహణ, అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. జోన్‌లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల మెరుగుదల, కొత్త సిగ్నలింగ్‌ను ప్రారంభించడం, యార్డు పునర్నిర్మాణం జోన్‌లో బైపాస్ లైన్ల అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టిన చర్యల గూర్చి అధికారులకు జిఎం పలు సూచనలు చేశారు. ఈ మేరకు జిఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వున్న అన్నిజోన్ల శాఖల ప్రధానాధిపతులతో కలిసి భద్రతా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ రైళ్లను సురక్షితంగా నడిపేందుకు షార్ట్ కట్ పద్ధతులను అనుసరించవద్దని, భద్రతా విధానాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, రైలు కార్యకలాపాల్లో నిమగ్నమైన సిబ్బందికి క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన సూచించారు. రైళ్లు సురక్షితంగా వెళ్లేందుకు తనిఖీలు ముమ్మరం చేసే దిశగా దృష్టి సారించాలని అధికారులకు జిఎం సూచించారు. వర్క్‌సైట్ భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉండేలా తరచుగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. సిబ్బంది అధికారులు సమర్థవంతంగా మరియు పకడ్బందీగా పని చేయడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని వారికి అందించాలని జి ఎం అరుణ్ కుమార్ జైన్ సూచించారు . రైలు కార్యకలాపాలకు 24 x 7 చురుకుదనం అవసరమని, సిబ్బంది తప్పనిసరిగా యోగా ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని తద్వారా వారు తమ విధులను నిర్వహించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండవచ్చని ఆయన చెప్పారు. జోన్‌లో ట్రాఫిక్ సౌకర్యం పనుల పురోగతిని కూడా ఈ సందర్బంగా జనరల్ మేనేజర్ సమీక్షించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News