Sunday, May 5, 2024

మొబైల్ ఆప్లికేషన్‌ను ప్రారంభించిన దక్షిణమధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

South Central Railway launches mobile application

హైదరాబాద్: భారతీయ రైల్వే హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎమ్‌ఐఎస్), యూనిక్ మొబైల్ ఐడెంటిటి కార్డు (యూఎమ్‌ఐడి) డౌన్ లోడింగ్ కోసం మొబైల్ ఆప్లికేషన్‌ను ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ హాస్పిటల్ లాలాగూడలో ట్రయిల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంతో రైల్వే బోర్డు చైర్మన్, సిఈఓ వినోద్ కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సేవను ప్రారంభించారు. ప్రారంభానికి ముందు ట్రయల్న్‌ల్రో భాగంగా 11 డిసెంబర్ 2020 తేదీన లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో రోగుల నమోదు, ఓపిడి డాక్టర్ డెస్క్, ఫార్మసీ 3 మాడ్యూల్స్‌తో హెచ్‌ఎమ్‌ఐఎస్ ట్రయల్ ప్రాజెక్టును ప్రారంభించారు. లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో ఈ ట్రయల్ ప్రాజెక్టులో ప్రారంభించిన 3 మాడ్యూల్స్ సుమారు వెయ్యి మంది రోగులకు ఉపయోగపడింది. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు భారతీయ రైల్వే ప్రస్తుత 3 మాడ్యూల్స్‌కు అదనంగా మరో మాడ్యూల్ ల్యాబరేటరీ మాడ్యూల్‌ను అధికారులు ప్రారంభించారు. హెఎమ్‌ఐఎస్ ప్రాజెక్టు కింద 4 మాడ్యూల్స్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 యూనిట్లలో (లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్, చిలకలగూడ, మౌలాలి, కాచిగూడ, నాంపల్లి (హైదరాబాద్) హెల్త్ యూనిట్లలో) ఉత్తర రైల్వేలోని 2 యూనిట్లలో (ఉత్తర రైల్వే సెంట్రల్ హాస్పిటల్, ఢిల్లీ డివిజినల్ హాస్పిటల్) అధికారులు ప్రారంభించారు.

రైల్వేలో హెచ్‌ఎమ్‌ఐఎస్ రైల్ టెల్ కార్పొరేషన్ లిమిటెడ్ సాయంతో భారతీయ రైల్వే ఈ మొబైల్‌యాప్‌ను అభివృద్ధి చేసింది. హెచ్‌ఎమ్‌ఐఎస్ లక్ష్యం సింగిల్ విండోలో భాగంగా వైద్యం, వైద్య పరీక్షలు, ఫార్మసీ, పరీక్షలు, పరిశ్రమలో ఆరోగ్యం వంటి వాటికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. హెచ్‌ఎమ్‌ఐఎస్‌తో యూఎమ్‌ఐడి అనుసంధానం కోసం మొబైల్ ద్వారా యూఎమ్‌ఐడి కార్డు డౌన్ లోడింగ్ కోసం మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఇది యూఎమ్‌ఐడి కార్డు ఉపయోగించే రైల్వే సిబ్బందికి ఆరోగ్య సేవలకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. రైల్వే ఉద్యోగులే కాకుండా వారిపై ఆధార పడిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ అప్లికేషన్ ద్వారా యూఎమ్‌ఐడి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జిఎం గజానన్ మాల్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News