Sunday, May 12, 2024

నూతన గరిష్ట రికార్డును నెలకొల్పిన దక్షిణ మధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -
5 నెలల్లో వివిధ అభివృద్ధి పనులకు రూ. 8,286 కోట్ల వ్యయం
వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణంలో 54 శాతం వ్యయం

మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే నూతన గరిష్ట రికార్డును నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో వివిధ అభివృద్ధి పనులకు రూ. 8,286 కోట్లను మూలధన వ్యయం కింద వెచ్చించిందని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023,-24లో మొదటి ఐదు నెలల్లో ఆగస్టు 2023 వరకు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా 54 శాతం కంటే ఎక్కువ మూలధన నిధుల వ్యయం (కాపెక్స్) చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 2022-,23లో ఆగస్టు వరకు మూలధనం కింద 34 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసిందని అధికారులు పేర్కొన్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వేకు 2023-,24 సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌లో రూ. 15,258 కోట్లు నిధులను కేంద్రం కేటాయించింది. ఇందులో వివిధ ప్రాజెక్టుల కోసం ఆగస్టు, 2023 వరకు వెచ్చించిన మూలధన వ్యయం రూ. 8,286 కోట్లు అని అధికారులు తెలిపారు.

ఐదు నెలల్లో 54 శాతం కంటే ఎక్కువ మూలధన వ్యయం…
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు చేసిన వ్యయంలో కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, ఇతర ట్రాఫిక్ సౌకర్యాల పనులతో సహా సామ ర్థ్యం పెంపు పనుల కోసం రూ.3,999 కోట్లు ఖర్చు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణం, ట్రాక్ పునరుద్ధరణలు, రైల్వే బ్రిడ్జి పనులు, సిగ్నల్ అండ్ టెలికాం పనులు వంటి భద్రతకు సంబంధిత పనుల కోసం రూ.981 కోట్లను ఖర్చు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. వినియోగదారుల, ప్రయాణికుల సౌకర్యాల పనుల కోసం రూ.131 కోట్లు, రోలింగ్ స్టాక్, ఇన్వెంటరీకి రూ. 2,296 కోట్లతో పాటు ఇతర ఆస్తుల సంబంధిత అభివృద్ధి పనుల కోసం రూ. 879 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 54 శాతం కంటే ఎక్కువ మూలధన వ్యయం చేసి రికార్డు సాధించగలిగిందని అధికారులు తెలిపారు.

అధికారుల బృందాన్ని ప్రశంసించిన జిఎం
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ప్రాజెక్టుల వేగవంతమైన అమలును నిర్ధారించడానికి అన్ని అభివృద్ధి పనుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుల అమల్లో జాప్యం జరగకుండా సరైన ప్రణాళికపై ఆయన దృష్టి సారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో మూలధన నిధుల వ్యయం వినియోగంలో సాధించిన పురోగతికి బృందాన్ని ఆయన ప్రశంసించారు. ప్రతి దశలో ప్రాజెక్ట్ అమలు వేగంగా జరిగేలా కచ్చితమైన ప్రణాళికను కొనసాగించాలని ఆయన అధికారులకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News