Sunday, May 5, 2024

నలుగురితో అంతరిక్ష కేంద్రానికి చేరిన స్పేస్‌ఎక్స్

- Advertisement -
- Advertisement -

SpaceX arrives at the space station with four people

 

కేప్‌కెనవెరెల్ : నలుగురు వ్యోమగాములను మోసుకొచ్చిన స్పేస్‌ఎక్స్ పాత కాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శనివారం చేరుకుంది. ఎలాన్ మస్క్ కంపెనీ ఏడాది కాలంలో మూడోసారి పంపిన మూడో ఎగిరే టాక్సీ ఇది. హిందూ మహాసముద్రానికి 420 కిలోమీటర్ల ఎత్తున ఆర్బిటింగ్ ఔట్‌పోస్టు వద్ద ఈ కాప్సూల్ తనంత తానే ఆగింది. నాసా కెనెడీ స్పేస్ సెంటర్ దీన్ని ప్రయోగించిన రోజు తరువాత ఇది ఇక్కడకు చేరుకుంది. ఇప్పుడు చేరుకున్న నలుగురు కొత్త వ్యోమగాములు, అమెరికా, ఫ్రాన్స్, జపాన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారు ఆరు మాసాలు గడుపుతారు. బుధవారం తమ స్వంత డ్రాగన్ కాప్సూల్ ద్వారా భూమికి తిరిగి రానున్న నలుగురు వ్యోమగాములకు బదులుగా వీరు అంతరిక్ష కేంద్రానికి వచ్చారు. ఒకే సమయంలో రెండు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్స్ అక్కడ పక్కపక్కనే పార్కింగ్ చేయడం ఇది మొదటిసారి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News