Sunday, April 28, 2024

అంబేద్కర్‌కు నివాళులర్పించిన స్పీకర్

- Advertisement -
- Advertisement -

Speaker Pocharam Flower Tribute To Dr. B.R Ambedkarహైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం నాడు శాసనసభ ప్రాంగణంలోని విగ్రహానికి రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ యంయస్ ప్రభాకర్ రావు, పలువురు శాసనసభ్యలు, మండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి. నరసింహా చార్యులు. ఈ సందర్భంగా సభాపతి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని, ప్రతి ఒక్కరికీ డా.బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను అందించారని కొనియాడారు. డా.బిఆర్ అంబేద్కర్ 130వ జన్మదినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ ఒక కులానికో, మతానికో ప్రతినిది కాదు, యావత్ భారతదేశానికి ఆదర్శమైన వ్యక్తి అని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంబేద్కర్ స్పూర్తి. చిన్న రాష్ట్రాలతోనే ప్రజలకు మంచి పరిపాలన అందుతుందన్న ఆయన ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాదించారన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనా విదానానికి అనుగుణంగా పరిపాలన సాగుతోందని, గత ఏడు సంవత్సరాలుగా దళత, గిరిజన, వెనుకబడిన వర్గాలను కడుపులో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అందించామన్నారు. అంబేద్కర్ సూచించిన బాటలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తే ఏ వర్గానికి కూడా సమస్యలు ఉండవని, ఆయన స్పూర్తితో అన్ని రాష్ట్రాలు పనిచేయాలి. తిట్టుకోవడం, విమర్శించుకోవడం రాజకీయం కాదని, ప్రజలు పనిచేయడానికి ప్రజాప్రతినిధులుగా మనలను ఎన్నుకున్నారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆత్మకు శాంతి చేకూరాలంటే మనమందరం కలిసి దేశ, రాష్ట్ర ప్రగతి సంక్షేమానికి పునరంకితం కావాలని తెలిపారు. అప్పుడే ప్రజలు సంతోషంగా ఉండటంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మన ప్రతి అడుగు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News