Wednesday, May 1, 2024

సౌండ్ పొల్యూషన్‌పై స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

Special Drive on Sound Pollution Vehicles

హైదరాబాద్ : డబ్లూహెచ్‌వొ గైడ్ లైన్స్ ప్రకారం శబ్ద కాలుష్యానికి కారణమైన 1,134 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు నగర ట్రాఫిక్ ఆడిషనల్ సిపి అనిల్ కుమార్ వెల్లడించారు. నగరంలోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రహదారులపై శబ్ద కాలుష్యానికి కారణమవుతోన్న ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారన్నారు.ఈ నెలలో ఇప్పటి వరకు 1,134 శబ్ద కాలుష్యానికి సంబంధించిన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బైకులు కొనే సమయంలో ఉన్న సైలెన్సర్లను తీసివేసి ఎక్కువ శబ్దం వచ్చే వాటిని అమర్చుకుంటున్నట్లు గుర్తించామన్నారు.శబ్ద కాలుష్యంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొదటిసారి సౌండ్ పొల్యూషన్‌కి పాల్పడితే రూ.1000 జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.2000 జరిమానా విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఎలాంటి వాహనాలు అయినా సౌండ్ పొల్యూషన్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్లూహెచ్‌వొ గైడ్ లైన్స్ ప్రకారం 65 డిసిబుల్ సౌండ్ మించి పైన ఉంటే నోయిస్ పొల్యూషన్ అవుతుందని 75 డిసిబుల్ ఉంటే హార్మ్ ఫుల్, 120 పైన ఉంటే పెయిన్ ఫుల్ గా ఉంటుందన్నారు. రోడ్లపై సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బైకులను సీజ్ చేస్తున్నామని బైక్ వాహనదారులు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ నిబంధనలు పాటించాలన్నారు. నాయిస్ పొల్యూషన్ వలన చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారని, దీని వల్ల గత యేడాది జనవరిలో 24 రోడ్డు మరణాలు చోటు చేసుకోగా ఈ ఏడాది జనవరిలో 10 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. బైకులు కొనేటప్పుడు ఉన్న సైలెన్సర్లను తీసివేసి ఎక్కువ సౌండ్ ఉన్న సైలెన్సర్లను అమర్చికుంటున్నారని దాంతో సౌండ్ పొల్యూషన్ పెరుగుతుందన్నారు. ఎలాంటి వాహనాలు అయిన సౌండ్ పొల్యూషన్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

చాంతాడంత చలానాలు…

ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు.. పది.. అంతకంటే కాదు.. ఓ టూవీలర్ వాహనంపై ఏకంగా 69 పెండింగ్ చలాన్లు ఉండడం ట్రాఫిక్ పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ట్రాఫిక్ పోలీసులు సదరు ద్విచక్ర వాహనాన్ని గుర్తించి ఆ చలాన్లకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇంతలో ఎపి 12 ఇజి 8524 నెంబర్ బైక్‌పై వస్తున్న పాతబస్తీలోని మచిలీకమాన్ ప్రాంతానికి చెందిన రిషబ్ గుప్తాను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అతని వాహనానికి సంబంధించిన చలాన్లను ఆన్‌లైన్‌లో చెక్ చేశారు.దీంతో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 69 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. అప్పటికప్పుడే సదరు వాహనదారుడు మొత్తం రూ.21,270 పెనాల్టీ కట్టాల్సి ఉందని నిర్ధారించారు. దీంతో అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చలాన్ల మొత్తాన్ని చెల్లించడంతో టూవీలర్ వాహనాన్ని అతని అప్పగించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News