Tuesday, April 30, 2024

సంక్రాంతికి స్పెషల్ ట్రెయిన్‌లు

- Advertisement -
- Advertisement -

Special Trains for Sankranthi Festival

 

జనవరి 01వ తేదీ నుంచి 20వ తేదీ వరకు
ప్రయాణికులకు అందుబాటులోకి
ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే

మనతెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు ఎపిలోని సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే వారికి దక్షిణమధ్య రైల్వే తీపికబురు అందించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 01వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లలో జనరల్ టికెట్ ఉండదని, రిజర్వేషన్ టికెట్‌లు ఉన్నవారు మాత్రమే ఎక్కాలని అధికారులు పేర్కొన్నారు. ఈ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ పోర్ట్ టు లింగంపల్లి (02737) స్పెషల్ ట్రెయిన్ ప్రతిరోజు సాయంత్రం 7.10 నిమిషాలకు కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం 6.05 నిమిషాలకు లింగంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి టు కాకినాడ (02738) స్పెషల్ ట్రెయిన్ ప్రతిరోజు రాత్రి 20.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు కాకినాడ పోర్ట్‌కు చేరుకుంటుంది. తిరుపతి టు లింగంపల్లి (02733) స్పెషల్ ట్రెయిన్ ప్రతిరోజు సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి టు తిరుపతి (02734) స్పెషల్ ట్రెయిన్ ప్రతిరోజు సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరి ఆ తరువాత రోజు ఉదయం 5.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News