Saturday, April 27, 2024

శాఖల వారిగా ఖాళీల వివరాలను అందించండి

- Advertisement -
- Advertisement -

CS review on the Job recruitment process

 

అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఊపందుకుంది. శాఖల వారిగా ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయన్న అంశంపై ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో సోమవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై సిఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొన్న ఈసమావేశంలో సిఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ, దాదాపు 50వేల పోస్టుల ఖాళీలను ప్రకటించేందుకు సిద్ధం ఉన్నాయని, వీటితో పాటు మరికొన్నిశాఖల్లోనూ ఖాళీలను రిక్రూట్ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.

ఆయా శాఖల అధికారులు వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, ఏ ఏశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిని స్పష్టం చేయాలని కోరారు. అధికారులు నివేదిక సమర్పించిన తర్వాత పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిఖాళీలు ఉన్నాయన్న దానిపై ముఖ్యమంత్రి కెసిఆర్ నివేదిక సమర్పిస్తామన్నారు. ఖాళీల భర్తీలో మార్పులు, సంస్కరణలను కూడా తీసుకు వస్తామన్నారు. ఖాళీల వివరాలను నిర్ణిత ప్రొఫార్మాలో సమర్రించాలని ఆదేశించారు. నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేత సెల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు చిత్రా రామ చంద్రన్, శాంతి కుమారి, రాణికుముదిని, ప్రిన్సిపల్ సెక్రటరీలు సునీల్‌శర్మ, రజత్‌కుమార్, జయేశ్‌రంజన్, రవిగుప్త, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News