Sunday, April 28, 2024

శ్రీలంక క్రికెటర్లకు నెగటివ్..

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ఊపిరి పీల్చుకుంది. క్రికెట్ బృందంలోని ఇద్దరికి కరోనా బారిన పడడంతో ఆటగాళ్లందరినీ రెండు రోజుల క్రితం ఐసొలేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం వీరికి నిర్వహించిన ఆర్‌టిపిసిఆర్ టెస్టుల్లో నెగటివ్ రావడంతో అటు శ్రీలంక, ఇటు భారత శిబిరాల్లో ఉత్సాహం నెలకొంది. నెగటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ ఆటగాళ్లను మాత్రమే బయటికి రావడానికి అనుమతించనున్నారు. కోచ్‌లు, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ మాత్రం బుధవారం వరకు ఐసొలేషన్‌లోనే ఉంటారని శ్రీలంక క్రికెట్‌బోర్డు తెలిపింది.

మంగళవారం నుంచి ఆటగాళ్ల టైనింగ్ ప్రారంభమవుతుందని బోర్డు తెలిపింది. లంక ఆటగాళ్లు ఖెట్టరామా స్టేడియంలో శిక్షణకు దిగనుండగా, టీమిండియా సింహళీస్ స్పోర్ట్ క్లబ్‌ను ఉపయోగించుకోనుంది. ఇటీవల శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, జట్టు అనలిస్టు జీటీ నిరోషన్‌లు కరోనా బారిన పడడంతో భారతశ్రీలంక జట్ల మధ్య ప్రారంభం కావల్సినసిరీస్‌ను రీఫెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. సవరించిన షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 18, 20, 23 తేదీల్లో వన్డేలు, 25, 27, 29 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Sri Lanka Cricketers test negative for Corona

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News