Friday, May 3, 2024

పది పరీక్షలకు రంగం సిద్ధం..

- Advertisement -
- Advertisement -

SSC STUDENTS

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమైతుండటంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులే గడువు ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్దులకు సరిపడ మాస్కులు, శానిటైజర్‌తో పాటు తాగు నీరు, విద్యుత్, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. వారం రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులు అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి విద్యార్దులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించడంతో మండలాధికారులు పనుల్లో వేగం పెంచారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 1.72 లక్షలమంది విద్యార్థులు పరీక్షలకు హాజరౌతుండగా వారి కోసం అదనంగా 87 కేంద్రాలతో పాటు మొత్తం 449 కేంద్రాలు సిద్దం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించనున్నారు.

ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని, పరీక్ష రాసే విద్యార్దులకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించేలా చర్యలు చేపడుతూ ప్రతి ఒక విద్యార్థి, పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులను ధరించేలా బాధ్యతలు చేపడుతున్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న విద్యార్దులకు ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్‌లతో పాటు ఎఎన్‌ఎంలు అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సెంటర్లకు వెళ్లే రూట్లలో బస్సులను అదనంగా పరీక్ష సమాయానికి అనుగుణంగా నడిపేలా సిద్దం చేస్తున్నారు. అదే విధంగా విద్యార్దుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించేలా చూడాలని, విద్యాశాఖ అధికారులు సూచనలు పాటిస్తూ పరీక్షకు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరుతున్నారు. సెంటర్లకు చేరుకునేందుకు విద్యార్దులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని ఉన్నత విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు.

SSC Exams 2020 start from June 8 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News