Sunday, April 28, 2024

ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

 

sensex ends flat

ముంబై:  ఆగస్టు 2న అత్యంత అస్థిరమైన సెషన్‌లో(ఒడిదుడుకుల మధ్య) భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్ నోట్‌తో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 20.86 పాయింట్లు లేదా 0.04% పెరిగి 58,136.36 వద్ద, నిఫ్టీ 5.50 పాయింట్లు లేదా 0.03% పెరిగి 17,345.50 వద్ద ముగిశాయి. దాదాపు 1829 షేర్లు లాభపడగా, 1460 షేర్లు క్షీణించాయి ,122 షేర్లు స్తబ్దుగా ఉండిపోయాయి. ఆగస్టు 3న ప్రారంభమయ్యే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ప్రారంభానికి ముందు మార్కెట్ జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. ఇండెక్స్ రోజువారీ చార్ట్‌లలో డోజీ నమూనాను పోలి ఉండే బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పడింది, ఇది బుల్స్ , బేర్స్ మధ్య నెలకొన్న  ట్రెండ్  అనిశ్చితిని సూచిస్తోంది.

నిఫ్టీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టిపిసి, మారుతీ సుజుకీ మరియు పవర్ గ్రిడ్ కార్ప్ ప్రధాన లాభాల్లో ముగిశాయి. కాగా యూపిఎల్, హీరో మోటోకార్ప్, ఎస్బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. సెక్టోరల్‌లో పిఎస్‌యూ బ్యాంక్‌, పవర్‌ సూచీలు 2 శాతం చొప్పున పుంజుకోగా, రియాల్టీ ఇండెక్స్‌ 1.7 శాతం క్షీణించాయి.బిఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి.

Bulls and Bears

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News