Sunday, April 28, 2024

‘హరోం హర’ ఫెరోసియస్ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబుకు ఇది అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ ట్రిగ్గర్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక వేల్ పట్టుకుని, పసుపు దీక్షా దుస్తులలో సుధీర్ బాబు గుడి ముందు ఉన్న రాతిపై కూర్చున్నారు, అతని వెనుక గ్రామస్తులు ఉన్నారు. శరీరమంతా రక్తపు గుర్తులతో గాయాలయ్యాయి. మ్యాసీ హెయిర్, గడ్డంతో ఉన్న సుధీర్ బాబు పోస్టర్‌లో ఫెరోషియస్ గా  కనిపిస్తున్నారు. పోస్టర్‌తో పాటు చిత్ర టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు మేకర్స్. టీజర్ దీపావళికి విడుదల కానుంది.

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News