Wednesday, May 15, 2024

యాక్షన్‌తో పాటు రొమాన్స్

- Advertisement -
- Advertisement -

 

యంగ్ హీరో సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ రంజిత్ జయకోడి దర్శకత్వంలోభారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో ప్రత్యేక యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు సందీప్ కిషన్. సందీప్ కిషన్ సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్‌ప్యాక్ బాడీ టెర్రిఫిక్ అనిపించింది. శుక్రవారం నిర్మాతలు ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. ‘మైఖేల్’ టీజర్ ఈనెల 20న విడుదల కానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సందీప్… దివ్యాంశ కౌశిక్ పెదవులపై ముద్దు పెట్టుకోవడం, బ్యాక్ గ్రౌండ్ లో ఎగిరే పక్షులతో పోస్టర్ డిజైన్ చేయడం రొమాంటిక్‌గా ఉంది. సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మాణంలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News