Wednesday, May 8, 2024

మత మార్పిడుల చట్టాలపై యుపి, ఉత్తరాఖండ్‌కు సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

Supreme Court issues notices to UP And Uttarakhand Govts

న్యూఢిల్లీ: మతాంతర వివాహాల కారణంగా జరుగుతున్న మతమార్పిడులను నియంత్రిస్తూ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రూపొందించిన వివాదాస్పద కొత్త చట్టాల చట్టబద్ధతను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. అయితే ఈ వివాదాస్పద చట్టాల నిబంధనల అమలును నిలుపుదల చేయడానికి చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. కాగా.. ఈ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

మతాంతర వివాహాలకు సంబంధించిన మత మార్పిడులను నియంత్రిస్తూ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రూపొందించిన నూతన చట్టాలను సవాలు చేస్తూ న్యాయవాది విశాల్ ఠాక్రే, ఇతరులు, సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనే స్వచ్ఛంద సంస్థ రెండు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై వాదప్రతివాదనల అనంతరం నాలుగు వారాల్లో సమాధానం కోరుతూ ఆ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీచేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

Supreme Court issues notices to UP And Uttarakhand Govts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News