Friday, May 3, 2024

రానా ప్రేమ, పెళ్లిపై సురేష్ బాబు కామెంట్స్..

- Advertisement -
- Advertisement -

 

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రానా తనకు కాబోయే భార్యను పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ప్రేమను అంగీకరించిందంటూ రానా మంగళవారం తన ప్రేయసి మిహిక బజాజ్ ని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళిద్దరు కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. దీంతోపాటు రానా, మిహిక బజాజ్ లు ఓ రూమ్ లో కూర్చొని నవ్వుతున్న మరో ఫోటో వైరల్ అవుతోంది. కాగా, రానా తన ప్రేయసిని పరిచయం చేసిన తర్వాత అభిమానులు, సెల‌బ్రిటీలు పెద్దఎత్తున శుభాకాంక్ష‌లు వెల్లువ కురిపించారు. తాజాగా రానా పెళ్లిపై సురేష్ బాబు ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ”మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. పిల్లలు ఇద్ద‌రు ఒక‌రినొక‌రు అర్థం చేసుకున్నారు. వారి వ‌ల‌న మేము సంతోషంగా ఉన్నాము. అన్ని కుదిరితే డిసెంబ‌ర్‌లో వారి పెళ్ళి జ‌ర‌పాల‌ని భావిస్తున్నాము. ప‌రిస్థితులు అనుకూలిస్తే కొంచెం త్వ‌ర‌గానే జ‌రిపే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం మేము వెడ్డింగ్ ప్లానింగ్స్‌లో బిజీగా ఉన్నాం” అని సురేష్ బాబు తెలిపారు.

కాగా, రానా ప్రస్తుతం ‘విరాట పర్వం’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కొన్ని హిందీ, తమిళ చిత్రాలకు కూడా ఆయన ఓకే చెప్పాడు. వీటితో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన ‘హిరణ్యకశిప’ మూవీలో నటించాల్సి ఉంది.

Suresh Babu Comments on Rana Wedding

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News