Sunday, April 28, 2024

ఎపి జల అక్రమాలపై ఫిర్యాదు చేశాం: కర్నె ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయంగా తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటిబొట్టును కూడా వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని పూర్తిగా తరలించేందుకు ఎపి ప్రభుత్వం కుట్ర పూరితమైన ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎపితో చీకటి ఒప్పందం కుదుర్చుకుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయంగా మనకు రావాల్సిన నీటిని వాడుకుంటామని ఆయన స్పష్ట చేశారు. ఎపి జల అక్రమాలపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశామన్నారు. నీటిని అక్రమంగా తీసుకెళ్లే ఎపి ప్రభుత్వ ప్రయత్నాన్ని అరికడతామన్నారు. సమైక్య రాష్ట్రంలో నీటి దోపిడిని టీఆర్ఎస్ అడుగడుగునా వ్యతిరేకించిందని కర్నె ప్రభాకర్ అన్నారు. సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పుడూ అన్నాయమే చేసిందని మండిపడ్డారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర జల దోపిడిని అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

MLC Karne Prabhakar fires on TS Congress Leaders

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News