Saturday, September 21, 2024

తల్లిదండ్రులపై ప్రత్యర్థులు రాడ్లతో దాడి… భయంతో బాలిక గుండె ఆగిపోయింది

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: కూతురు కళ్లెదుటే కన్నతల్లిదండ్రులపై ప్రత్యర్థులు పాశివికంగా దాడి చేస్తుంటే.. బాలిక తట్టుకోలేక ఆందోళనకు గురై మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డి కొత్తపల్లి గ్రామంలో కాసం సోమయ్య తన భార్య, కూతురు పావని(4)తో కలిసి ఉంటున్నారు. అదే గ్రామంలో కడారి సైదులుతో సోమయ్య గొడవలు ఉన్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో సోమయ్య తన గ్రామాన్ని వదిలి సూర్యాపేటలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. సైదులు మాత్ర తన గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కూతురు పావని ఆరోగ్య బాగోలేకపోవడంతో తన సొంతూరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు.

పాత కక్షలు మనుసులో పెట్టుకొని సైదులు మరో ఇద్దరు కడారి సోమయ్య, కాసం కళింగంతో కలిసి సోమయ్య ఇంటికి వెళ్లారు. కర్రలు, రాడ్లతో కాసం సోమయ్య దంపతులపై దాడి చేయడంతో కూతురు తట్టుకోలేకపోయింది. కన్నతల్లిదండ్రులను చితకబాదుతుంటే ఆందోళన చెంది భయంతో ఒక్కసారిగా పావని కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దంపతులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కాసం సోమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఐలయ్య తెలిపాడు. సిఐ రఘువీర్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకొని కేసు పూర్వపరాలను తెలుసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News