Saturday, May 11, 2024

ఒంటరి మహిళ పై హత్యాచారం…ఆపై హత్య

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : అనుమానాస్పదంతో మృతి చెందిన మహిళ హత్య కేసును రెండు రోజుల్లో చేదించి నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూర్ ఎస్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన నిమ్మల ఉమాదేవి(65) ని ఈ నెల 7న గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసి పారిపోగా గ్రామస్థుల సమాచారం పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ రోజు రాత్రి సమయంలో గ్రామంలో సంచరించిన వారి వివరాలు అనుమానితుల వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేశారు.ఈ మేరకు సోమవారం ఉదయం 9గంటలకు అనుమానితులైన అదే గ్రామానికి చెందిన కప్పల విజయ్, గుగులోతు కలేందర్‌లను విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 7న కప్పల విజయ్, గుగులోతు కలేందర్ ముక్కుడుదేవుల పల్లిలో మద్యం సేవించి వచ్చి మృతురాలు నిమ్మల ఉమాదేవి ఇంట్లోకి చొరబడి డబ్బులు తెస్తానని మిత్రుడు కలేందర్‌ను ఇంటి ముందు కాపలా ఉంచి విజయ్ మృతురాలు ఉమాదేవి ఇంటి తలుపులు బలవంతంగా తెరిచి ఆమె ముఖం పై పిడిగుద్దులు గుద్ది నోట్లో బలవంతంగా దూది కుక్కి తన చరవాణిలో సెల్ఫీ వీడియో తీసుకుని హత్యాచారం చేసినట్లు తెలిపారు. దూది నోట్లో కుక్కడంతో ఊపిరాడక చనిపోయిన ఉమాదేవి ఇంట్లోని సూటుకేసులో ఆరు తులాల బంగారు ఆభరణాలు అయిన పుస్తలతాడు, నల్లపూసల గొలుసు, రెండు జతల చెవిదిద్దులు, ఉంగరాలతో పాటు 5వేల రూపాయల నగదు దొంగలించుకుని పారిపోయినట్లు తెలిపారు.

మరుసటి రోజు ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌లో నగలు తాకట్టు పెట్టి ఒకలక్షా 90వేల రూపాయలు లోన్ తీసుకుని అదే రోజు సూర్యాపేటలోని బజాజ్ షోరూరంలో 48వేలు లోను చెల్లించి పల్సర్ బైక్ కొన్నట్లు తెలిపారు. 10వేల రూపాయలతో అదనపుల ఫిట్టింగులు, మరో 10వేల రూపాయలతో కొత్త బట్టలు కొన్నట్లు 7వేల రూపాయలతో మద్యం సేవించినట్లు విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు. విఆర్‌ఏల సమక్షంలో నేరస్తులు తప్పును ఒప్పుకోగా దొంగిలించిన వాటిని రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసు డిఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో రూరల్ సిఐ సోమనారాయణ సింగ్, ఆత్మకూర్ ఎస్సై యాదవేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఇరుగుబాబు, వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్ నాగార్జున, పవన్‌కుమార్, హోంగార్డు నిరంజన్‌లను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News