Sunday, April 28, 2024

పాకిస్థాన్‌కు ఇబ్బందులు ఖాయం: షోయబ్ అక్తర్

- Advertisement -
- Advertisement -

లాహోర్: రానున్న టి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేయడం కష్టమేనని పాక్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఇతర ఆటగాళ్లకు సయోధ్య లేదన్నాదు. ఇది జట్టు ఆటపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమన్నాడు. కిందటి ప్రపంచకప్‌తో పోల్చితే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు బలహీనంగా కనిపిస్తుందన్నాడు. కెప్టెన్ ఆజమ్ ఫామ్‌ను కోల్పోవడం పాకిస్థాన్‌కు పెద్ద ఇబ్బందికర పరిణామమన్నాడు. ఫకర్ జమాన్ కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడం లేదన్నాడు. ఇక జట్టు బ్యాటింగ్ ఆశలన్నీ మహ్మద్ రిజ్వాన్‌పైనే ఆధారపడ్డాయన్నాడు. ఇక వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టు కూడా ఏ మాత్రం బాగాలేదన్నాడు. ప్రస్తుత జట్టులో లోతైన మిడిలార్డర్ లేదన్నాడు. ఇలాంటి స్థితిలో పాకిస్థాన్ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టినా ఆశ్చర్యం లేదన్నాడు.

T20 World Cup: Shoaib Akhtar about Pakistan Team

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News