Tuesday, April 30, 2024

ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించాలి 

- Advertisement -
- Advertisement -

గోషామహల్: సిటీ సెక్యూరిటీ వింగ్ సబ్ ఇన్‌స్పెక్టర్, తెలంగాణ పోలీస్ ఎన్‌ఐ ఎస్ జూడో కోచ్ హరినాధ్ కుమారుడు తమ్మల సాయి పుత్ర నాథ్ ఇటీవల యూపీలో జరిగిన రెజ్లింగ్ ఓపెన్ క్యాటగిరి చాంపియన్ షిప్‌లో బ్రౌంజ్ మెడల్, 2023 తెలంగాణ గోల్డ్ మెడల్‌తో పాటు గ్రాబిలిం గ్‌లో మహారాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచారు. తమ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న సాయిపుత్ర నాధ్ జాతీయ స్థాయి రెజ్లింగ్ పో టీల్లో మెడల్స్ సాధించిన సందర్బంగా ఆదివారం సెయింట్ జోసఫ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం సాయిపుత్ర నాధ్‌ను ఘనంగా సన్మానించి ంది.

ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ సుందర్ రెడ్డి, కళాశాల స్పోర్ట్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డిలు సాయిపుత్ర నాధ్‌ను శాలువా తో ఘనంగా సన్మానించి, అభినందిం చారు. ఈ సందర్బంగా వారు సాయిపుత్ర నాథ్‌కు కళా శాల పక్షాన ఎలాంటి సహకారం అందించేందుకు అయినా సిద్దంగా ఉన్నట్లు తెలి పారు. అనంత రం సాయిపుత్ర నాధ్. కళాశాల ప్రిన్సిపల్‌తో కలిసి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్‌ను మ ర్యాద పూర్వకంగా కలిశారు. సాయిపుత్రనాథ్ రెజ్లింగ్‌లో సా ధించిన పతకాల గురించి గురించి తెలుసుకున్న సీవీ ఆనంద్ ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రతిభావంతులైన క్రీడాకారుల ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సాయిపుత్ర నాధ్ భవిష్యత్‌లోనూ ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ, రెజ్లింగ్‌లో అత్యుత్తమ ప్ర దర్శన కనబర్చి, మరిన్ని పతకాలను సాధి ంచి తెలంగాణ రాష్ట్ర కీర్తి, ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News