Sunday, April 28, 2024

తాలిబన్ల వల్ల పాక్‌కు మేలు, ఇండియాకు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Talibans are good for Pakistan and dangerous for India

ఎంఐఎం అధినేత అసదుద్దీన్

లఖ్నో: అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడం వల్ల పాకిస్థాన్‌కే మరింత ప్రయోజనమని, ఇండియాకు ప్రమాదమని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ఒవైసి అన్నారు. మన దేశ పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసిన రూ.35,000 కోట్లు అఫ్ఘాన్ అభివృద్ధి కోసం ఖర్చు చేశామని, ఇప్పుడది తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడం ఆందోళనకరమని ఒవైసి అన్నారు. అక్కడ జరిగిన అధికార మార్పిడి ఇండియాకు ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. యుపికి చెందిన మాజీ ఎంపి అతిఖ్‌అహ్మద్, ఆయన భార్య ఎంఐఎంలో చేరిన సందర్భంగా ఒవైసి మీడియాతో మాట్లాడారు. యుపిలో అతిఖ్ అహ్మద్‌కు ముఠానేతగా పేరున్నది. ఆయనపై పలు క్రిమినల్ కేసులున్నాయి. సెప్టెంబర్ 2న అసద్ మొదటిసారి అఫ్ఘాన్ పరిణామాలపై గళం విప్పారు. తాలిబన్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నారా..? లేదా..? అంటూ కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News