Sunday, April 28, 2024

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20: సెమీస్‌లో హైదరాబాద్ ఓటమి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం తమిళనాడుతో జరిగిన సెమీస్ పోరులో హైదరాబాద్ ఓటమి పాలైంది. తమిళనాడు 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తట్టుకోలేక 18.3 ఓవర్లలో కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. శ్రవణ్ కుమార్ 21 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అతని ధాటికి హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ఎదురు నిలువలేక పోయారు. త్యాగరాజన్ ఒక్కడే కాస్త పోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను కాస్త సమర్థంగా ఎదుర్కొన్న త్యాగరాజన్ 25 పరుగులు సాధించాడు. హైదరాబాద్ జట్టులో రెండంకెల స్కోరును అందుకున్న ఏకైక బ్యాటర్‌గా అతను నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు హరి నిశాంత్ (14), జగదీశన్ (1) విఫలమయ్యారు. అయితే సాయి సుదర్శన్ 34 (నాటౌట్), కెప్టెన్ విజయ్ శంకర్ 45 (నాటౌట్) మరో వికెట్ నష్టపోకుండానే తమిళనాడుకు విజయం సాధించి పెట్టారు. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన తమిళనాడు తుది పోరుకు దూసుకెళ్లింది.
తుది పోరుకు కర్ణాటక
మరో సెమీఫైనల్లో కర్ణాటక విజయం సాధించింది. విదర్భతో జరిగిన సెమీఫైనల్లో కర్ణాటక 4 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసి ఫైనల్‌కు చేరుకుంది. ఓపెనర్లు రోహద్ కదమ్, మనీశ్ పాండేలు కర్ణాటకను ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహన్ 56 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మనీశ్ పాండే వేగంగా 54 పరుగులు సాధించాడు. అభినవ్ మనోహర్ (27) పరుగులతో తనవంతు పాత్ర పోషించాడు. అయితే చివర్లో ప్రత్యర్థి బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీయడంతో కర్ణాటక స్కోరు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ గెలుపు కోసం చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు అతర్వ(32), గణేశ్ సతీశ్(31) శుభారంభం అందించారు. అయితే మిగతావారు విఫలం కావడంతో విదర్భకు ఓటమి తప్పలేదు.

Tamil Nadu beat Hyderabad with 8 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News