Sunday, April 28, 2024

ఆర్‌టిసి విలీనం బిల్లుకు రాజ్‌భవన్ మోకాలడ్డు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం బిల్లుకు రాజ్‌భవన్ మోకాలడ్డుతోందని సమాచారం. రెండు రోజులుగా బిల్లుపై తన అభిప్రాయాన్ని గవర్నర్ తమిళిసై చెప్పడం లేదు రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో గవర్నర్ కాన్సెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ప్రస్తుతం నడిస్తున్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. కానీ రెండు రోజులుగా గవర్నర్ స్పందించకపోవడంతో తమిళిసై తీరుపై ఆర్‌టిసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సర్కారుపై వ్యతిరేక వైఖరితోనే ఆర్‌టిసి బిల్లును గవర్నర్ ఆపుతున్నారని ఆర్‌టిసి కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆర్‌టిసి కార్మికుల్లో అధిక శాతం బడుగు బలహీన వర్గాలు, పేదలే ఉన్నారని, వారిని ఇబ్బంది పెట్టేలా గవర్నర్ వ్యవస్థ వ్యవహరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.

Also Read: రామన్నపేటలో దారుణహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News