Tuesday, May 21, 2024

ఆ వార్తలు నిజమని చెప్పలేను.. ఖండించలేను: ఎల్ రమణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికార పార్టీ టిఆర్ఎస్ లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై తెలంగాణ టిడిపి శాఖ అధ్యక్షుడు ఎల్ రమణ స్పందించారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ.. తనతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చించిన మాట నిజమే.. తనను టిఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పిన మాట నిజమేనని చెప్పారు. కానీ, తనకు ఆఫర్ ఇచ్చే విషయం మాత్రం ప్రస్తావనకు రాలేదన్నారు. గతంలో కూడా పార్టీలోకి రమ్మని టిఆర్ఎస్ నాయకులు కోరినట్లు తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిజమని చెప్పలేను.. ఖండించలేను అని ఆయన చెప్పారు. కాగా, అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వివాదస్పదమైన  బిసి వర్గానికి చెందిన మాజీ మంత్రి టిఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంతో రమణను తమ పార్టీలోకి తీసుకునేందుకు సిఎం కెసిఆర్ సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

TDP leader L Ramana respond on joining in TRS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News