Thursday, December 7, 2023

తెలంగాణలో పోటీ చేయని టిడిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో టిడిపి జెండా పీకేసింది. జాతీయ పార్టీ అని చెప్పుకొని తెలంగాణలో టిడిపి చేతులెత్తేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ టిడిపి క్యాడర్‌కు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకేతాలు పంపించారు. తెలంగాణలో పోటీ చేయొద్దంటూ టిటిడిపి పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు ఆదేశాలు పంపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేలు చేయడం కోసమే తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నామని రాజకీయ ప్రముఖులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకునన విషయం తెలిసిందే. తెలంగాణ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఎందుకు పోటీ చేయలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News