Saturday, April 27, 2024

ప్రైవేట్ వీడియోని లీక్ చేసిన బాయ్ ఫ్రెండ్.. బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్: తన ప్రైవేట్ వీడియోని బాయ్ ఫ్రెండ్ లీక్ చేయడంతో పదహారేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ లోని ఛరనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బాలిక, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ఒకరికొకరు అనుమతితో తమ ప్రైవేటు వీడియోలను షూట్ చేసుకున్నారు. అయితే, ఆమె ప్రైవేటు వీడియోని బాయ్ ఫ్రెండ్ తన ముగ్గురు స్నేహితులకు లీక్ చేశాడు. తర్వాత వారు ఆ వీడియోని స్థానికంగా వైరల్ చేశారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ రేప్ చేయడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత తన కూతురి ప్రైవేటు వీడియోని లీక్ చేసినట్లు వారు గుర్తించారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన బాయ్ ఫ్రెండ్ తోపాటు ఆమె ప్రైవేటు వీడియోని వైరల్ చేసిన ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై  పోక్సో చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Teen girl hangs self after Boyfriend leaked intimate video

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News