Wednesday, May 8, 2024

”తేజస్” రైలు సర్వీసులు అక్టోబర్ 17 నుంచి పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

Tejas train services resumed from October 17

న్యూఢిల్లీ: ఈ నెల 17 నుంచి ”తేజస్” ప్రైవేట్ రైలు సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఐఆర్‌సిటిసి బుధవారం ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబయి సర్వీసులను ఏడునెలల క్రితం ఐఆర్‌సిటిసి నిలిపివేసింది.
ఈ రెండు రైళ్లలో సీటుకు సీటుకు మధ్య ఖాళీ ఉంచుతామని, కోచ్‌లోకి ప్రవేశించేముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తామని, ఒకసారి సీటులో కూర్చున్న తర్వాత మరో సీటులోకి మారే అవకాశం ఉండబోదని ఐఆర్‌సిటిసి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కొవిడ్-19 రక్షణ కిట్‌ను కూడా అందచేస్తామని, ఇందులో ఒక హ్యాండ్ శానిటైజర్ బాటిల్, ఒక మాస్క్, ఒక ఫేస్ షీల్డ్, ఒక జత గ్లవ్స్ ఉంటాయని పేర్కొంది. ప్యాంట్రీ(కిచెన్) ప్రదేశాలు, టాయిలెట్స్‌తోపాటు కోచ్ అంతటా తరచు శానిటైజ్ చేయడం జరుగుతుందని, ప్రయాణికుల లగేజ్, బ్యాగేజ్‌లను కూడా సిబ్బంది డిస్‌ఇన్‌ఫెక్ట్ చేస్తారని వివరించింది.

Tejas train services resumed from October 17

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News