Monday, April 29, 2024

రాష్ట్రంలో 33 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Another 2,154 Corona positive cases

 

జిహెచ్‌ఎంసిలో 303, జిల్లాల్లో 1851 కేసులు
వైరస్ దాడిలో మరో 8 మంది మృతి
2,04,748కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
1200లకు చేరువలో మరణాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 2,154 పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 303 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో23, భద్రాద్రి 92,జగిత్యాల 45, జనగాం 23, భూపాలపల్లి 25, గద్వాల 19, కామారెడ్డి 71, కరీంనగర్ 96,ఖమ్మం 121, ఆసిఫాబాద్ 16,మహబూబ్‌నగర్ 40, మహబూబాబాద్ 45, మంచిర్యాల 39, మెదక్ 29, మేడ్చల్ మల్కాజ్‌గిరి 187, ములుగు 25, నాగర్‌కర్నూల్ 33, నల్గొండ 124, నారాయణపేట్ 12, నిర్మల్ 19, నిజామాబాద్ 60, పెద్దపల్లి 42,సిరిసిల్లా 41, రంగారెడ్డి 205, సంగారెడ్డి 63, సిద్ధిపేట్ 78, సూర్యాపేట్ 79, వికారాబాద్ 28,వనపర్తి 31, వరంగల్ రూరల్ 28, వరంగల్ అర్బన్ లో 74, యాదాద్రిలో మరో 38 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 8 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,04,748కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 1,77,008కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 26,551మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా, 1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

1200లకు చేరువలో కరోనా మరణాలు…

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాలు 1200లకు చేరువయ్యాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1189 మరణాలు సంభవించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే వీరిలో 44.96 శాతం కేవలం కోవిడ్‌తో చనిపోగా, మరో 55.04 మంది కో మార్పిడ్(వైరస్ సోకకముందు ఇతర వ్యాధులుండటం)తో మరణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరణాల రేట్‌కు అతి తక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరోనా మరణాల రేట్ 1.5 శాతం ఉండగా తెలంగాణలో కేవలం 0.58 మాత్రమే ఉండటం గమనార్హం. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలే ఇది సాధ్యమవుతున్నట్లు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.

33 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు…

రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 33 లక్షలు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33,46,472 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి పది లక్షల మందిలో 89,910 మందికి చొప్పున టెస్టులు చేశామని అధికారులు వెల్లడించారు. అయితే మంగళవారం చేసిన 54,277 టెస్టుల్లో 50,239 ప్రభుత్వం ఆధ్వర్యంలో, మరో 4038 శాంపిల్స్‌ను ప్రైవేట్‌లో పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారిలో 1,43,324 మందికి ఎలాంటి సింప్టమ్స్ లేకుండా వైరస్ సోకితే 61,424 మందికి సింప్టమ్స్‌తో కోవిడ్ పాజిటివ్ తేలినట్లు హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్స్‌లో 8114 బెడ్లు, ప్రభుత్వాసుపత్రుల్లో 8868, ప్రైవేట్‌లో 9143 పరుపులను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News