Saturday, April 27, 2024

ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు అధికారంలో మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi in power for 20 years

 

బిజెపి నేతల ప్రశంసలు

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలతోసహా ప్రభుత్వాధినేతగా 20 సంవత్సరాలు నిరాటంకంగా పదవిలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీని బిజెపి నాయకులు బుధవారం అభినందనలతో కీర్తించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ మొదటిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన 2001 అక్టోబర్ 1వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అభివర్ణించారు. ఆ నాటి నుంచి నరేంద్ర మోడీ భారీ విజయాలను అందుకుంటూనే ఉన్నారని, ఆయన ప్రతిష్ట నానాటికీ ఇనుమడిస్తూనే ఉందని నడ్డా ట్వీట్ చేశారు. గడచిన 19 సంవత్సరాలుగా మోడీ ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాల వివరాలను బిజెపి ట్వీట్ చేసింది. మానవాళికి, భరతమాతకు అంకిత భావం, దార్శనికత, నిస్వార్థంతో గత 20 ఏళ్లుగా మోడీ సేవలు అందచేస్తున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీర్తించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా మొత్తం 6941 రోజులను నరేంద్ర మోడీ విజయవంతంగా పూర్తిచేసుకున్నారని బిజెపి అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News