Sunday, April 28, 2024

దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ

- Advertisement -
- Advertisement -
  • సిఎం కెసిఆర్ లాంటి నేత దేశానికి అవసరం
  • మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పథకం
  • గజ్వేల్ పర్యటనలో మహారాష్ట్ర సర్పంచుల మనోగతం

గజ్వేల్: కేంద్ర ప్రభుత్వం అంటున్నట్లు దేశానికే గుజరాత్ రాష్ట్రం ఒక రోల్‌మోడల్ కాదని తెలంగాణ రాష్ట్రమే దేశానికి రోల్ మోడల్ అని మహారాష్ట్ర కు చెందిన సర్పంచుల బృందం కితాబిచ్చింది. మంగళవా రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అభివృద్ధి పనులను పరిశీలించటానికి మహారాష్ట్రకు చెందిన సుమారు వంద మంది సర్ప ంచుల బృందం వచ్చింది. ఈ సందర్భంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ము న్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా సర్పంచుల బృందానికి పుష్పుగచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం సమీకృత మార్కెట్‌లోని వివిధ వివిధ విభాగాలకు నిర్మించిన దుకాణాలు, ఇతర నిర్మాణాలను సర్పంచుల బృం దం పరిశీలించింది.

వాటిని పరిశీలించిన సర్పంచుల బృ ందం ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అతితక్కువ కాలంలో దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చెందటం గొప్పవిషయమని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ లె క్కన తెలంగాణ అభివృద్ధి ముందు గుజరాత్ అభివృద్ధి ఫెయిల్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో తమ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధిపై విజన్ ఉన్న కెసిఆర్ లాంటి నాయకుడు తమకు అవసరమన్నా రు.తెలంగాణలో రోడ్డు వ్యవస్థ, అడవలు అభివృద్ధి, మం చినీటి సౌకర్యం, సాగునీటి రంగాలలో ప్రభుత్వం పురోభివృద్ధి సాధించిందన్నారు. భారత దేశం అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ లాంటి నాయకుడు మహారాష్ట్రకే కాకుండా యావత్ భారత దేశానికి అవసరమని వారు అన్నారు. ఇంతమంచి మార్కెట్‌ను తాము ఎప్పుడూ ఎక్కడా చూడలేదన్నారు. పటిష్టమైనర గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపే తం చేసి పల్లెల్లో ప్రజల చేతిలో సంపదను పెంచిన ఘనత కెసిఆర్‌దేనని కొనియాడారు.

ఈ సందర్భంగా ఎఎంసి చై ర్మన్ మాదాసు శ్రీనివాస్ సర్పంచులతో మాట్లాడుతూ వివిధ రంగాల్లో అభివృద్ధి పరంగా కెసిఆర్ రాక ముందు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందన్న విషయా న్ని సమగ్రంగా వివరించారు. రైతు రాజ్య స్థాపకుడు సిఎ ం కెసిఆర్ అని, అన్నివర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తూ సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఎఎంసి కార్యదర్శి జాన్ వెస్లీ. పలువురు మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ ప్లాంటు ఒక అద్భుతం

అన్న మహా సర్పంచులు

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఇంటింటికీ శుభ్రమైన తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేయటం అద్భుతమైన విషయమని మహారాష్ట్ర సర్పంచులు అ న్నారు. మంగళవారం గజ్వేల్ పర్యటనకు వచ్చిన ఆ రాష్ట్ర సర్పంచుల బృందం పట్టణానికి సమీపంలోని కోమటి బండలో ఎత్తైన గుట్టపై ప్రత్యేక ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచులు మిషన్ భగీరథ డిఈ నాగార్జున ఆధ్వర్యంలో అక్కడి ప్లాంటులోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచులకు డిఈ నాగార్జున మిషన్ భగీరథ ఉద్దేశం, ప్రణాళిక, నీటి శుద్ధీకరణ, నీటి సరపరా తీరు, మిషన్ భగీరథ ప థకం అమలు, నీటి నాణ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు.

ఇందుకోసం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజల దాహార్తి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే క్రమంలో చేసిన భగీరథ యత్నం ఫలించిందని , ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని మహారాష్ట్ర సర్పంచులు అభిప్రాయ పడ్డారు. తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషిని వారు కొనియాడారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్లాంటులో పైలాన్ ఇతర చోట్ల ఫోటోలు దిగటానికి ఆసక్తి చూపారు. అంతకు ముందు వారంతా మల్లన్న సాగర్ వద్ద మిషన్ భగీరథ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని పరిశీలించి గజ్వేల్ పర్యటనకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News