రాష్ట్రంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) సీట్ల భర్తీకి నిర్వహించిన మొదటి విడత టిజి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో 9,955 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. బి.ఇడి సీట్లు పొందిన వారిలో 2,154 మంది అమ్మాయిలు ఉండగా, 7,801 మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం టిజి సెట్స్ కన్వీనర్ పాండురంగారెడ్డి సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడించారు. తొలి దశ కౌన్సెలింగ్‌లో మొత్తం 14,295 బి.ఇడి సీట్లు అందుబాటులో ఉండగా, 17,151 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో 9,955 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈసారి ఇడబ్లూఎస్ కోటాలో 189 మంది విద్యార్థులు సీట్లు పొందారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ తెలిపారు. రిపోర్టింగ్ సమయంలోనే ఆయా కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
9955 బిఈడీ సీట్లు భర్తీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -