Sunday, April 28, 2024

జలచౌర్యాన్ని ఆపండి

- Advertisement -
- Advertisement -

 Krishna river Board

 

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలన్న ఎపి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ తెచ్చిన జీఓను వెంటనే నిలిపివేయండి
శ్రీశైలంపై కొత్త ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీరని అన్యాయం, విభజన చట్టాన్ని ఆ రాష్ట్రం ఉల్లంఘించడమే
కృష్ణానది బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
నేడు బోర్డు చైర్మన్‌తో తెలంగాణ
నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ చర్చలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ప్రారంభమైంది. పోతిరెడ్డిపాడు పంచాయితీ ముదురుతోంది.

పోతిరెడ్డి సామర్ధంపై పెంపు నిర్ణయంపై ఎపి ప్రభుత్వ జారీ చేసిన 203పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చే స్తోంది. ఇందుకు నిరసనగా కృష్ణాబోర్డుకు మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఎపిప్రభు త్వం శ్రీశైలం నుంచి కొత్త లిఫ్ట్ స్కీం ఏర్పాటు చేయడం అ న్యాయమని ఫిర్యాదులో పేర్కొంది. శ్రీశైలం నుంచి మూడు టిఎంసి నీటిని ఎపికి తరలించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు వివరించింది.

ఎపి ప్రభుత్వం తెచ్చిన 203 జిఒ అక్రమమని, వెంటనే నిలిపివేయాలని కోరింది.కెఆర్‌ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఎపి ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిందని కోష్టాబోర్డుకు ఇచ్చిన ఫిర్యాదులో తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. వెం టనే ఎపి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ నిలిపివేసేలా కృష్ణా బోర్డు చర్యలు చేపట్టాలని తెలంగాణ సర్కార్ కోరింది. ఇదే అంశంపై బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌తో మాట్లాడనున్నారు.

గతంలోనే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఎపి ప్రభుత్వం పూనుకోవడం….దానికి తెలంగాణ ప్రభు త్వం అభ్యంతరం చెప్పడం జరిగాయి. తాజాగా ఎపి ప్రభు త్వం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లడంతో మరోసారి ఇది చర్చనీయాంశమైంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఎపి ప్రభుత్వం గత డిసెంబరులోనే నిర్ణయించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తమకు అన్యా యం జరుగుతుందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు విషయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కృష్ణాబోర్డు ఇప్పటికే ఎపి ప్రభుత్వానికి గతంలోనే సూచించింది.

అయితే ఇదేమీ పట్టించుకోకుం డా ప్రాజెక్టు విస్తరణపై ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య సెగలు రాజుకున్నాయి. కాగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి తే తెలంగాణ నీటి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయన్న ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40 వేల క్యూసెక్కులుగా ఉండగా ఈ సామర్థ్యంతోనే ఎపి భారీగా శ్రీశైలం నీటిని తరలిస్తుందనే ఆరోపణలున్నా యి. దీని సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడం ద్వారా మరింత నీటి ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అదే జరిగితే శ్రీశైలంపై ఆధారపడ్డ తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందనే ఆందోళన నెలకొని ఉంది.

బోర్డుకు లేఖ రాసిన రజత్ కుమార్

ఎపి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 203 జిఒపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ కృష్ణనది యాజమాన్య బోర్డ్‌కు ఒక లేఖ రాశారు. ఎపి పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి 3 టిఎంసిల నీటి తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వం జారీ చేసిన జిఓపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. శ్రీశైలం నుండి కొత్త లిఫ్ట్ స్కింను ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. ఎపి ప్రభుత్వం జారీ చేసిన అడ్మినిస్ట్రేషన్ జీవో అక్రమమని, కెఆర్‌ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే ఏ ప్రాజెక్ట్ అయిన మొదలు పెట్టాలని ఆ లేఖలో రజత్‌కుమార్ సూచించారు. దీనిపై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఎపిలో టెండర్ల ప్రక్రియ నిలిపివేయాల్సిందిగా కోరారు.

మా వాటా నీళ్లనే వాడుకుంటాం
ఎపి సిఎం జగన్‌మోహన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా బోర్డు నిర్దేశాల మేరకే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని తీసుకోవడానికి ప్రాజెక్టు కట్టుకుంటున్నామని, మా వాటా నీళ్లను మాత్రమే వాడుకుంటామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కృష్ణా జలాల అంశంపై స్పందిస్తూ అమరావతిలో మంగళవారం సిఎం తన నివాసంలో ఇరిగేషన్ అధికారుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన వాట నీటిని వాడుకోవడంలో మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని, రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

రాష్ట్రానికి కేటాయించిన నీటిని కాకుండా అదనంగా వాడుకునే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పారు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశాకే నీటి కేటాయింపులు చేస్తుందని తెలిపారు. ఆ కేటాయింపుల పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదని వివరించారు. అదేవిధంగా శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుదని, ఈ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండదన్నారు. ఆ పది రోజుల కాలంలో పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News