Wednesday, May 8, 2024

ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు సృష్టించిన తెలంగాణ

- Advertisement -
- Advertisement -

9 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు
మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అవకాశం
గత ఏడాది 48.75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ
14 జిల్లాల్లోని 1,810 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి
అకాల వర్షాలు ఇబ్బందుపాలు చేసినా.. వేగవంతంగా కొనుగోళ్లు
కేంద్రం తన నిర్ణయాన్ని పున:సంమీక్షించుకోవాలి
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

Centre of failing to play its role responsibly and spreading lies

మనతెలంగాణ/హైదరాబాద్:  ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఈ వానాకాలంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి గత ఏడాది రికార్డును తిరగరాసింది.గత ఏడాది వానాకాలంలో పౌరసరఫరాల సంస్థ 48.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజాగా ఈ వానాకాలంలో దాన్ని బ్రేక్ చేస్తూ గురువారం నాటికి దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. వానాకాలంలో ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించింది.ఈ ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దార్శనికత వల్లనే సాధ్యమైంది. సిఎం కెసిఆర్ ఆర్ నాయకత్వంలో ఏడు సంవత్సరాల్లో దేశం అబ్బురపడే విధంగా తెలంగాణలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందింది వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని నిరూపించారు.

వ్యవసాయమే సాధ్యం కాదన్నచోట ఏడాదిలో కోటి టన్నులకు పైగా ధాన్యం పండించి చూపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు అడుగడుగునా అండగా నిలిచారు.సమైక్య రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తినడం, గిట్టుబాటు ధర కోసం ధర్నాలు చేయడం, నీళ్ల కోసం బోర్లు వేసి అప్పులపాలు కావడం, కరెంటు, గిట్టుబాటు ధర కోసం, పెట్టుబడికోసం.. ఇలా ప్రతి దానికి రైతాంగం అష్టకష్టాలు పడుతూ పండించిన ధాన్యాన్ని నామమాత్రంగా కొనుగోలు చేసేవారు. ఉమ్మడి పాలనలో రైతాంగం పడిన కష్టాలన్నిటినీ రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిశితంగా గమనించారు. ఉద్యమ నాయకుడిగా వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలను లోతుగా అధ్యయనం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు పడిన రైతులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పడకూడదని, నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్రంలో అభివృద్ధిపర్చడానికి సిఎం అలుపెరుగని రీతిగా చేపట్టిన సంక్షేమ పథకాలతో అతికొద్ది కాలంలోనే రాష్ట్రంలో వ్యవసాయరంగం ముఖచిత్రమే మారిపోయింది.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కెసిఆర్ ప్రధాన లక్ష్యాలలో రైతు సంక్షేమం ఒకటి, రైతు ఆదాయాన్ని పెంచడానికి, వారి జీవితాల్లో సౌభాగ్యం నింపడానికి గడిచిన ఏడు సంవత్సరాల్లో రైతు సాధికారత కోసం నిరంతరం కీలక నిర్ణయాలు తీసుకుంటువచ్చారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో రైతంగం అభివృద్ధికోసం గతంలో ఎన్నడు, ఎక్కడా జరగనంత ప్రయత్నాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగున్నాయి. . ధాన్యం కొనుగోళ్లు అర్థికంగా భారం కావడంతో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలుకు ముందుకు రాని నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంత ఆర్థిక భారమైనా భరించి రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.కోటి ఎకారాలను సాగులోకి తేవాలని కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రపంచం యావత్తు అశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. గ్రామాల్లో చెరువులను నింపారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటలు కరెంటును ఉచితంగా అందిస్తున్నారు. వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా ఎరువులు, విత్తనాల కోసం రైతుబంధు పథకం ద్వారా ప్రతి పంటకు రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు వేస్తున్నారు. ఏ కారణంతోనైనా రైతు మరణించిన ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రైతు భీమా అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. రైతులంగా ఒక దగ్గర కూర్చొని వ్యవసాయంపై చర్చించుకునేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేశారు. పంట అమ్ముకోవడానికి రైతులకు అందుబాటులో ఉండే విధంగా కళ్లాలను ఏర్పాటు చేయడంతోపాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం ఏర్పడడం వల్ల రైతులు రాష్ట్రంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో పంటలు పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతితో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత పరిస్థితిని గమనిస్తే ధాన్యం కొనుగోళ్లలో సాధించిన పురోగతి కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15 వానాకాలంలో 11 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. నేడు దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం దారా సరికొత్త రికార్డు సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు వానాకాలం సీజన్ లో 2.47 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.ధాన్యం దిగుబడి, కొనుగోళ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలను ప్రశంసించి ప్రోత్సహించాల్సిన కేంద్రం ఇందకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది . దశాబ్దల ఉ మ్మడి రాష్ట్రంలో సాధ్యం కానిది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో ఈ ప్రభుత్వం సాధించిది.

50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ:

వానాకాలం సీజన్లో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి హామీ ఇచ్చారు. అలాగే రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి వరకు మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 6,849 కొనుగోలు కేంద్రాల ద్వారా 9 లక్షల మంది రైతుల నుండి 10 వేల కోట్ల విలువచేసే దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఒక వైపు ఆకాల వర్షాలు మరోవైపు రకరకాల నిబంధనలతో కేంద్రం ఇబ్బందులపాలు చేసినా.. కొనుగోళ్లలో వేగం పెంచారు. గత ఏడాది ఇదే సమయానికి 37 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశారు. ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈ సీజన్ వరకు ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో రైతాంగం ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని , నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మరో 14 జిల్లాల్లో 1,810 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ఈ సీజన్‌లో ఎంత రైతులు ఎంత ధాన్యం తెచ్చినా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లలో తన నిర్ణయాన్ని పున సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News