Friday, May 10, 2024

ఎనిమిదేళ్లలో 24,000 కంపెనీలకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్ ఐపాస్ కింద తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 24,000 కంపెనీల ప్రతిపాదనలను ఆమోదించిందని టిఎస్‌ఐఐసి విసి, ఎండి ఇ. వెంకట్ నర్సింహా రెడ్డి (ఐఎఎస్) పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని హైటెక్స్‌లో అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్‌పో 2023 ‘హైప్లెక్స్’ ప్రారంభమైంది. దక్షిణ, మధ్య భారత్‌లో అతిపెద్ద ఎక్స్‌పో అయిన ఈ హైప్లెక్స్ ఆగస్టు 4 నుండి 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగనుంది. ఈ ప్రదర్శన 8 సంవత్సరాల తర్వాత కొత్త అవతార్‌లో ఐప్లెక్స్ స్థానంలో హైప్లెక్స్ పేరుతో ఇది నిర్వహిస్తున్నారు. దీనిని అధికారికంగా ప్రభుత్వానికి చెందిన టిఎస్‌ఐఐసి పిసి, ఎండి ఇ.వెంకట్ నర్సింహా రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఆహార పరిశ్రమతో పాటు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్‌లపై జిఎస్‌టి(18 శాతం)ని తగ్గించాలని ప్లాస్టిక్ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది.

వెంకట్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, టిఎస్ ఐపాస్ చట్టం తెలంగాణ ప్రభుత్వ మైలురాయి నిర్ణయమని అన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన వివిధ లైసెన్సుల జారీకి ఇది వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందిస్తోందని, దీని ద్వారా గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 24,000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించామని అన్నారు. మొదటి ప్లాస్టిక్ పార్క్ పూర్తిగా అమ్ముడు పోయింది. రెండోది కావాలంటే టిఎస్‌ఐఐసి భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని నర్సింహారెడ్డి అన్నారు. హైప్లెక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 400 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల సాధారణ వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ తయారీదారుల సంఘం(టాప్మా) అధ్యక్షుడు విమలేష్ గుప్తా వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News