Sunday, April 28, 2024

తొమ్మిది మంది ఐపిఎస్‌లకు పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

ts police

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు డిఐజిలకు ఐజిగా, మరో ఆరుగురు ఎస్‌పిలకు డిఐజిలుగా పదోన్నతి కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో 2002 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన డిఐజిలు రాజేశ్ కుమార్, శివకుమార్‌రెడ్డి, రవీందర్‌లకు ఐజిలుగా పదోన్నతి కల్పించారు. అలాగే 2006 ఐపిఎస్ బ్యాచ్, తెలంగాణ క్యాడర్ చెందిన కార్తికేయ, రమేష్‌నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావులకు డిఐజిలుగా పదోన్నతి కల్పించారు. ఇదిలావుండగా రాష్ట్రంలో మరికొందరు ఐపిఎస్‌ల అధికారులకు బదిలీలతో పాటు పదోన్నతులు జరుగనున్నట్లు తెలియవచ్చింది. ఐపిఎస్‌ల బదిలీలు, పదోన్నతులు 2018లోనే జరగాల్సివుండగా, అసెంబ్లీ ముందస్తు ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి.

ఈక్రమంలో 2019 ఏప్రిల్ నెలలో రాష్ట్ర హోంశాఖ కేంద్రం అనుమతితో 23 మంది ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించిన విషయం విదితమే. ఇదిలావుండగా ఐపిఎస్‌లకు పదోన్నతితో పాటు బదిలీ తప్పనిసరి కాగా సదరు అధికారులు అదే స్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎస్‌పి, డిఐజిలుగా పనిచేస్తున్న 10మంది అధికారులకు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్‌లలోని కీలక విభాగాల్లో పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Telangana Govt Promotion Orders to 9 IPS Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News