Saturday, April 27, 2024

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

- Advertisement -
- Advertisement -

Telangana govt report to the high court on Corona

హైదరాబాద్: కరోనా పరిస్థితులపై తెలంగాణ సర్కార్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25 వరకు 23.55 లక్షల కరోనా పరీక్షలు చేసినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4.39 లక్షల ఆర్టీపిసిఆర్, 19.16లక్షల ర్యాపిడ్ టెస్టులు చేసినట్టు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 25వరకు 341 మంది కరోనా బాధితులు మృతి చెందినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 3.5 శాతం ఉందని వెల్లడించింది. కరోనా పరీక్షల పెంపునకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పింది. నిపుణుల కమిటీ సమావేశాలను ఆన్ లైన్ లో జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మద్యం దుకాణాలు, పబ్ లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపన ప్రభుత్వం మద్యం దుకాణాలను ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారని విరించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 430 టన్నుల ఆక్సిజన్ ను కేటాయించిందని, వివిధ ప్రాంతాల నుంచి ప్రాణవాయువును చేరవేస్తున్నామని చెప్పుకొచ్చింది. రెమ్ డెసివిర్ పర్యవేక్షణ నోడల్ అధికారిగా ప్రీతిమీనాను నియమించామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News