Sunday, May 5, 2024

తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్

- Advertisement -
- Advertisement -

 

తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజ‌నీకుమార్ నియామ‌కం అయ్యారు. ప్ర‌స్తుతం ఉన్న డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఈ నెల 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం అంజ‌నీ కుమార్ ఏసీబీ డీజీగా కొన‌సాగుతున్నారు. రాచ‌కొండ సీపీగా కొన‌సాగుతున్న మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌ను సీఐడీ అడిష‌న‌ల్ డీజీగా నియామకం అయ్యారు. రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్‌గా డీఎస్ చౌహాన్‌ను నియ‌మించారు. ఏసీబీ డీజీగా ర‌వి గుప్తా నియామ‌కం కాగా, హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా డీజీగా జితేంద‌ర్, లా అండ్ ఆర్డ‌ర్ డీజీగా సంజ‌య్ కుమార్ జైన్ నియామ‌కం అయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News