Tuesday, May 7, 2024

దేశంలోనే సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

మియాపూర్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫిజ్ పేట్, చందానగర్, భారతి నగర్ డివిజన్ల పరిధిలోని కల్యాణ లక్ష్మి/షాదీముబారక్ పథకం ద్వారా మంజూరైన 173 మంది లబ్ధ్దిదారులకు 1,73,20,068/రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు, మంజుల రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఆయన సోమవారం అందించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేసి పేదలకు అండగా నిలిచారని, కల్యాణ లక్ష్మి/షాదీముబారక్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పెద్ద అన్నగా నిలిచారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, మోహన్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, హఫిజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, హఫిజ్ పేట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు మరియు బీఆర్‌ఎస్ నాయకులు కర్ణాకర్ గౌడ్, శ్రీను పటేల్, లకా్ష్మరెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, జనార్ధన్ రెడ్డి, సత్యనారాయణ, రఘునాథ్, దామోదర్, రాంచందర్ రెడ్డి, వజీర్, జనార్ధన్, బాబుమోహన్ మల్లేష్, మల్లేష్, నరేందర్ బల్లా ప్రవీణ్, గోపాల్ యాదవ్, అశోక్ సాగర్, రాథోడ్, శివ, మాధవి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News