Thursday, May 2, 2024

పాకిస్థాన్‌లో హిందూ దేవాలయానికి స్థలం అప్పగింత

- Advertisement -
- Advertisement -

temple
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయానికి మొదటి సారి కేటాయించిన స్థలాన్ని క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ(సిడిఎ) తీసేసుకుంది. కానీ దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసేసరికి తిరిగి ఆ స్థలాన్ని ఇచ్చేశారు. ఈ విషయంపై ఇస్లామాబాద్ హైకోర్టు తాజా విచారణ చేపట్టినట్లు ‘డాన్’ వార్తాపత్రిక ఇటీవల పేర్కొంది. కాగా కొన్ని కారణాల దృష్టా గుడి నిర్మాణాన్ని అడ్డుకున్నామని అంతేకానీ తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని సిడిఎ కోర్టుకు తెలిపింది. ఇస్లామాబాద్‌లో 2016లో మొదటిసారి మందిరానికి అర్ధ ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఇందులో మందిరంతో పాటు కమ్యూనిటీ సెంటర్, హిందూ స్మశానవాటిక నిర్మించాలని నిర్ణయించారు. కాగా 2021 ఫిబ్రవరిలో సిడిఎ అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇస్లామాబాద్‌లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. దాంతో సిడిఎ దిగిరాక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News