Tuesday, April 30, 2024

కెజిబివిల్లో ఆహార పదార్థాల సరఫరాకు టెండర్లు ఖరారు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాలలు,1 యుఆర్‌ఎస్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న సుమారు 9వేల మంది విద్యార్థినిలకు 2023, 24 విద్యా సంవత్సరంలో మెనూకు అవసరమైనా ఆహార పదార్థాల సరఫరా కు టెండర్లు ఖరారు చేశామని నాగర్‌కర్నూల్ జి ల్లా అదనపు కలెక్టర్ ఎస్. మోతిలాల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో డిఈఓ గోవిందరాజులు కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల ప్రత్యేక అధికారులు, పాఠశాలల ప్రిన్సిపల్స్, విద్యాశాఖ అధికారులు, టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు.

మెనూ అమలులోగానీ, ఆహార పదార్థాల సరఫరాలో గానీ తేడాలొస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు సంబంధించిన 20 కస్తూర్భా పాఠశాలలు, 10 కస్తూర్బా కళాశాలలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో అర్బన్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు మెనూ అమలుకు సంబంధించి మే నెల 10వ తేది నుంచి ఈ నెల 8వ తేది వరకు టెండర్లను ఆహ్వానించగా 450 దాఖలు అయ్యాయన్నారు. కిరాణం సరుకులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, చికెన్, మటన్ సరఫరా కు టెండర్లు ఖరారైన సంబంధిత కాంట్రాక్టర్లు ని బంధన మేరకు నాణ్యమైన సరుకులను సరఫరా చే యాలని, ముఖ్యంగా గుడ్లు సరఫరాకు గుడ్ల సైజు పై సంబంధించిన కాంట్రాక్టర్‌కు ప్రత్యేక సూచన లు చేశారు. అలాగే మటన్, చికెన్ తాజా నాణ్యమై న విధంగా సరఫరా చేయాలని, అరటిపండు పరిమాణం పెద్దదిగా ఉండాలన్నారు.

నాణ్యమైన పాల సరఫరా చేయాలని ఆదేశించారు. దీనిపై సంబంధిత పాఠశాలల ప్రిన్సిపల్స్ దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతినెల అన్ని పాఠశాలల ప్రత్యేక అధికారులు, ప్రిన్సిపల్స్, విద్యాశాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహిస్తామని సూచించారు. మెనూ అమలుకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆ దేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అ ధికారి ఎం. గోవిందరాజులు, గణాంక అధికారి ఈశ్వరప్ప, కేజిబివిల పర్యవేక్షణ అధికారిని సూ ర్య చైతన్య, డిఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ నాగేందర్, కార్యాలయ అధికారులు శైలజ, శ్రీనివాస చారి, పవన్ కుమార్, సిబ్బంది శ్రీకాంత్, ఆంజనేయులు, కేజిబివిల ప్రిన్సిపల్స్, టెండర్ దారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News