Sunday, April 28, 2024

ట్విట్టర్‌ను కొంటా..

- Advertisement -
- Advertisement -

43 బిలియన్ డాలర్లకు ఇచ్చేయండి..
షేరుకు 54 డాలర్ల చొప్పున 100% తీసుకుంటా
బిలియనీర్ ఎలన్ మస్క్ ఆఫర్

 

న్యూయార్క్ : టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను 43 బిలియన్ డాలర్లకు (రూ. 3.2 లక్షల కోట్లు) కొనుగోలు చేస్తానని ఆఫర్ చేశారు. దీని కోసం మస్క్ ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున అంటే 54 శాతం ప్రీమియంతో నగదు రూపంలో చెల్లించేందుకు సిద్ధమయ్యారు. 100 శాతం వాటాలను మొత్తం 43 బిలియన్ డాలర్లకు తీసుకుంటానని అన్నారు. కంపెనీ అసాధారణ సామర్థం కల్గివుందని, దానిని తాను అన్‌లాక్ చేస్తానని ప్రపంచంలోనే నంబర్ వన్ కుభేరుడు మస్క్ అన్నారు. ఈ ప్రకటనతో ట్విట్టర్ షేర్లు మార్కెట్లో 12 శాతం పెరిగాయి.

తాను పెట్టుబడి పెట్టినప్పటికీ, ప్రస్తుత రూపంలో ట్విట్టర్ అభివృద్ధి చెందబోదని గ్రహించానని, ట్విట్టర్‌ను ప్రైవేటు కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని మస్క్ అన్నారు. ‘నా ఆఫర్ ఉత్తమమైంది, ఆఖరిది. దీనికి అంగీకరించకపోతే వాటాదారుడిగా నా స్థానం పున-ఃపరిశీలించుకోవాల్సి ఉంటుంది’ అని ఆయన అన్నారు. మస్క్ ఆఫర్‌పై చర్చించడానికి బోర్డు త్వరలో సమావేశం అయ్యే అవకాశముంది. మస్క్ ఇటీవల ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు.

తన పెట్టుబడులకు సరైన ఫలితం దక్కేందుకు, వాస్తవికత ప్రాతిపదికన తాను ట్విట్టర్ కొనుగోలుకు ఆఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడున్న పద్ధతిలో ట్విట్టర్ తన సామాజిక బాధ్యతలను సరిగ్గా తీర్చలేకపోతోందని తాను గుర్తించినట్లు తెలిపారు. ట్విట్టర్‌ను పూర్తి స్థాయిలో ప్రైవేటు కంపెనీగా మార్చాలనేదే తన ఆలోచన అని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్‌కు రాసిన లేఖలో మస్క్ వివరించారు. గత వారం మస్క్‌ను ట్విట్టర్ బోర్డులో చేరాలని పిలుపు వచ్చింది. అయితే దీనికి ఆయన ఆయన నిరాకరించారు. ఇప్పుడు ఏకంగా దీనిని కొనేందుకు ముందుకు వచ్చారు.

వస్వేచ్ఛకు వేదిక : ఆఫర్ లేఖలో మస్క్

ట్విట్టర్ కొనుగోలుకు ముందుకు వచ్చిన ఎలన్ మస్క్ యాజమాన్యానికి రాసిన లేఖలో ఈ బహుళ స్థాయి మాధ్యమానికి ఉన్న శక్తిని ప్రస్తుతించారు. ప్రపంచస్థాయిలో ట్విట్టర్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛా వేదిక అవుతుంది. ఇందుకు అవసరం అయిన సాధనాసంపత్తిని సంతరించుకుంది. అయితే ఇప్పటి స్వరూపం మారకపోతే ఈ శక్తి నిరర్థకం అవుతుంది. స్వేచ్ఛ భావవ్యక్తికరణం సామాజిక అనివార్యం. ఈ దిశలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహణకు స్వేచ్ఛా వేదిక అవసరం. ఈ శూన్యతను ట్విట్టర్ భర్తీ చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రైవేటు కంపెనీగా తీర్చిదిద్ది దీనిని సముచిత రీతిలో పరివర్తనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ట్విట్టర్‌కు అసాధారణ శక్తి ఉంది. అయితే లాక్ పడింది. దీనిని తాను అన్‌లాక్ చేస్తానని ఆయన ఈ లేఖతో ముందుకు వచ్చారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News