Sunday, April 28, 2024

ఎస్‌ఎఫ్‌ఐ కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సోమవారం భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ముట్టడించేందుకు ర్యాలీగా వచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను, విద్యార్ధులను పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకోవడంతో అక్కడే బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. విద్యార్ధులకు రెండు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందలేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ కళాశాలకు, సంక్షేమ ఇంటర్మీడియట్ గురుకులాలకు పుస్తకాలు ముద్రించి పంపలేదని అన్నారు. 24 వేల టీచర్ పోస్టులు, 12000 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జిల్లాలోని 15 మండలాలకు ముగ్గురు విద్యాధికారులు ఉండటం సిగ్గు చేటని విమర్శించారు. గురుకులాలు, వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని అన్నారు. తక్షణం విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరష్కరించాలని ఆర్‌ఎల్ మూరి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని అన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, జిల్లా అధ్యక్షులు బి.వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలు సీబీఎస్‌ఇ, ఐసీఎస్‌ఇ పేరుతో లక్షల వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.కిరణ్, అరుణ్, జిల్లా నాయకులు ప్రసాద్, శ్రీను, శ్రీశైలం, నరసింహా, పవన్, ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News