Sunday, April 28, 2024

వైద్య రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం తుంగతుర్తిమండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రా రంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వైద్యం పేదలకు అందని ద్రా క్షలా ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వైద్య రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుందన్నారు. నేడు రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులో ఉందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు, 100 పండకల ఆసుపత్రులను ఏర్పాటు చేసిన ఘతన సీఎం కేసీఆర్‌దే అన్నారు.

గర్బీణీల్లే పోషక ఆహార లోపం, రక్తహిన లేకుండా కాపాడేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంకు ఒక్క మెడికల్ కళాశాల కూడా ఇవ్వనప్పటికి ఆరోగ్య తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేశారన్నారు. ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలో డయగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

త్వరలో నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు అందిస్తున్న వేతనాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. పలువురు వ్యాదిగ్రస్తులు, వివిధ ఆరోగ్య సమస్యలను జయించిన వారు డాక్టర్ల సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. కిడ్ని, కంటి వెలుగు, ప్రసూతి వైద్యం చేయించుకోని నయమైన రోగులు, వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు. వైద్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డాక్టర్లను ఎమ్మెల్యే అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ కిరణ్ కుమార్, జిల్లా వైద్య నియంత్రణ అధికారి డాక్టర్ పెండెం వెంకటమరణ, యాదాద్రిభువనగిరి జిల్లా డిప్యూటి డీఎంహెచ్‌వో డాక్టర్ వరుధిని, డాక్టర్లు, తహసీల్దార్లు,ఎంపీడీవోలు, మార్కెట్ చైర్మన్లు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News